Chiranjeevi: మానవ మృగం తనకు తానే శిక్ష వేసుకుంది

Chiranjeevi: బాధిత కుటుంబానికి ఇది ఊరట కలిగించే వార్తే : చిరంజీవి

Update: 2021-09-16 10:37 GMT

మెగాస్టార్ చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: మానవ మృగం రాజు ఆత్మహత్య పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్న కామాంధుడు తనకు తానే శిక్షించుకోడం కొంత ఊరటే అయినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ ఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయన్నారు.. మళ్లీ మళ్లీ ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చైతన్యంతో వ్యవహరించాలన్నారు. ఈ మేరకు ఎవరు ముందుకొచ్చినా వారికి తన సహకారం ఉంటుందని చిరంజీవి అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని చిరంజీవి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News