Mega Food Park: ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్

Mega Food Park: ఆదుకోవడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను ఏర్పాటు చేశారు.

Update: 2021-03-26 03:46 GMT

Mega Food పార్క్ఫ(ఫైల్ ఇమేజ్) 

Mega Food Park: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగాఫుడ్ పార్క్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2007-2008లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఫుడ్ పార్క్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పనులు స్పీడ్ అందుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు..

203 ఎకరాల గిరిజనుల భూమి సేకరణ...

ఈ మెగాఫుడ్ పార్క్‌ కోసం ఇప్పటికే 203 ఎకరాల భూమిని గిరిజనుల నుంచి సేకరించారు.. అందులో 60 ఎకరాలలో ఫుడ్ పార్క్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే.. గిరిజనుల దగ్గర నుంచి తక్కువ ధరకు భూమిని తీసుకుని.. ఇప్పటి వరకు సరైన సాయం అందించలేదంటున్నారు స్థానికులు..

ఫుడ్ పార్క్‌లో కోల్డ్ స్టోరేజీని కూడా...

ఫుడ్ పార్క్‌లో కోల్డ్ స్టోరేజీని కూడా నిర్మిస్తున్నారు. పండ్లను నిల్వ చేసేందుకు తగ్గుట్టుగా ర్యాకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫుడ్ పార్కులో ఫ్రూషన్ ఇండియా, బయో ఇన్ గ్రిడియోలకు భూములు కేటాయించారు.. పార్క్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 50 కోట్లు, TSIIC నుంచి 30 కోట్లు, నాబార్డు నుంచి 29 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాంతంలో పండే జామ, మామిడి, కొబ్బరి పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నాయి.

నిరుద్యోగులకు....

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడితే.. ఒక పక్కన రైతులు, మరోపక్కన నిరుద్యోగులకు ఈ పార్క్‌ ఉపయోగకరంగా ఉందంటున్నారు. ఫుడడ్‌పార్క్‌ పూర్తయితే ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉపాది దొరికే అవకాశం ఉంది. మొత్తనికి మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ పూర్తయి ఆచరణలోకి వస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు, ఫుడ్ పార్క్ ఒక వరంగా ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News