మీ సేవల్లో ఆలస్యంగా సేవలు.. దరఖాస్తు చేసుకున్నా చేతికందని సర్టిఫికెట్స్...

Mee Seva: మీసేవల చుట్టూ చక్కర్లు కొడుతున్న సిటీజనం...

Update: 2022-04-12 03:34 GMT

మీ సేవల్లో ఆలస్యంగా సేవలు.. దరఖాస్తు చేసుకున్నా చేతికందని సర్టిఫికెట్స్...

Mee Seva: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బర్త్ సర్టిఫికెట్, తీసుకోవాలన్నా, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా నరకం కనిపిస్తుంది. మీసేవ చుట్టూ ప్రదిక్షణలు చేసినా బల్దియా అధికారులు కరుణించడం లేదు. కావాల్సిన సర్టిఫికేట్ అప్రూవల్​ చేయట్లేదు. టెక్నాలజీతో సేవలు ఈజీ అనే చెప్పే బల్దియా అధికారులు ఎందుకు సర్టిఫికెట్లు జారీచేయలేకపోతున్నారు. జనానికి ప్రభుత్వ సేవలు ఆలస్యంగా అందుతున్నాయా..

జీహెచ్ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ పత్రాల దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీసేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ బాధ్యతలను కేటాయించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తు స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని గ్రేటర్ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీసేవా కేంద్రాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.

ఇలా కొత్తవిధానం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి సమస్య వస్తుందంటున్నారు మీ సేవా నిర్వాహకులు. ఇప్పటి వరకు రెవెన్యూ, రవాణా తదితర డిపార్టుమెంట్ల సర్టిఫికెట్ల జారీని మీ సేవ సెంటర్లు నిర్వహిస్తుండగా, కొద్దినెలల కిందట బర్త్, డెత్​సర్టిఫికెట్ల సేవలను కూడా అప్పగించారు. త్వరలో మ్యూటేషన్ల సేవలను కూడా ట్రాన్స్​ఫర్ ​చేసేందుకు బల్దియా సిద్ధమైంది. కానీ సర్టిఫికెట్లు టైమ్​కు ఇస్తున్నారా లేదా అన్నది పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News