ఖమ్మం గుమ్మంలో ఉక్రెయిన్ పిల్లి.. వీసా, ఫ్లైట్ టిక్కెట్టు..

Ukraine Cat: ఉక్రెయిన్ లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలని వేలమంది విద్యార్థులు భావించారు.

Update: 2022-03-09 09:33 GMT

ఖమ్మం గుమ్మంలో ఉక్రెయిన్ పిల్లి.. వీసా, ఫ్లైట్ టిక్కెట్టు..

Ukraine Cat: ఉక్రెయిన్ లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలని వేలమంది విద్యార్థులు భావించారు. చదువుకుంటున్న విద్యాసంస్థలను వీడి తలదాచుకోడానికి నానా ఇబ్బందులు పడ్డారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో యుద్ధప్రాతిపదికన వేలమంది విద్యార్థులు బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇండియాకొచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రఖ్యాత్ అనే మెడికల్ స్టూడెంట్ తను పెంచుకున్న ఉక్రెయిన్ పిల్లిని నెత్తినపెట్టుకుని నానా కష్టాలతో స్వగ్రామం చేరుకున్నాడు.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లోని ఇవానో ఫ్రాన్కివ్ లో మెడిసిన్ చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మూడు రోజుల పాటు సాంజ అనే తన పెంపుడు పిల్లి నీ నెత్తి మీద పెట్టుకొని కాలినడకన ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకొని అక్కడి నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నట్లు ప్రఖ్యాత్ చెప్పాడు.

రెండు నెలల్లో వైద్యకోర్సు పూర్తవుతుందనుకున్న తరుణంలో యుద్ధవాతావరణం గందరగోళ పరిస్థితుల్ని సృష్టించింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పిల్లికి పెట్ పాలసీ కింద వీసా, ఫ్లైట్ టిక్కెట్టు తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు.

వైద్య విద్య బోధించే అధ్యాపకురాలు తనకు పిల్లిని బహుమతిగా ఇచ్చారని సాంజ అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న దానిని అక్కడే వదిలి వేయలేక తనతోపాటు తీసుకువచ్చిన ప్రఖ్యాత్ జంతు ప్రేమను అతని కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News