Telangana: అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదిక
Telangana: మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం రోజుకోక మలుపు తిరుగుతోంది.
Telangana: మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం రోజుకోక మలుపు తిరుగుతోంది. అసైన్డ్ భూముల వ్యవహారంపై కలెక్టర్ హరీష్ సమగ్రంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హ్యాచరీస్ ఆధ్వర్యంలో కబ్జా చేసిన భూములు ఉన్నట్టు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూకబ్జా జరిగినట్టు అధికారులు తేల్చారు.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన 66 ఎకరాల ఒక గుంట అసైన్డ్ ల్యాండ్ కబ్జాకు గురైనట్టు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు రైతుల అనుమతి లేకుండా జమున హ్యాచరీస్ కోసం రోడ్డు వేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. కబ్జా చేసిన భూముల్లో ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్టు, వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లను తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హ్యాచరీస్ ఫౌల్ట్రీ షెడ్డులు నిర్మించారు. వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఎగ్గొట్టినట్టు నివేకలో తేల్చారు.