Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Medak: ఆగస్టు 10న మెదక్ జిల్లా యశ్వంత్ రావుపేట్ గ్రామంలో కారు డిక్కీలో దొరికిన మృతదేహం శ్రీనివాస్‌దిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.
Medak: ఆగస్టు 10న మెదక్ జిల్లా యశ్వంత్ రావుపేట్ గ్రామంలో కారు డిక్కీలో దొరికిన మృతదేహం శ్రీనివాస్‌దిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేయగా A-2 పవన్, A-3 నిఖిల్ లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కారు దగ్ధం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు కాగా కేసు విచారణ సాగుతోందని తెలిపారు. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందని తెలిపిన ఎస్పీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేసినట్లు పేర్కొన్నారు.