నాకు కరోనా టెస్ట్ చేయండి.. స్టేషన్ లో యువకుడి హంగామా

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసులకు, అధికారులకు మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది.

Update: 2020-06-23 13:09 GMT

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసులకు, అధికారులకు మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. తనకు కరోనా టెస్టులు నిర్వహించడం లేదంటూ ఓ యువకుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లి నానా రాద్ధాంతం చేసాడు. దీంతో పోలీసులు ఆ యువకుడికి పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో ఒక మహిళకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు, అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కాగా పాజిటివ్ వచ్చిన మహిళతో ఆమె కుమారుడు ప్రైమరీ కాంటాక్ట్‌ ఉండడంతో అతనికి కూడా పరీక్షలు చేయాలని కోరాడు.

ఆ తరువాత ఏకంగా బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తనకు కరోనా టెస్ట్‌ చేయడం లేదంటూ నానా హంగామా చేశాడు. దీంతో పోలీస్ సిబ్బంధి ఆ యువకుడిని వెంటనే పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించారు. అంతే కాడు యువకుడికి కరోనా వచ్చి ఉంటే తమకు కూడా వస్తుందేమో అని ముందుజాగ్రత్త చర్యగా పోలీస్‌ స్టేషన్‌ను మూసేసి వారు కూడా హోం క్వారైన్ టైన్ కి వెల్లిపోయారు. ఇక పాజిటివ్ వచ్చిన మహిళ హైదరాబాద్‌లో తన బంధువుల వద్ద 8 రోజులు ఉండి వచ్చిందన్న సమాచారం రావడంతో మంగళవారం కరోనా లక్షణాలు బయటపడడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News