Jagtial: కింగ్‌ ఫిషర్‌ బీర్లు దొరకడం లేదు.. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు..

Jagtial: ప్రజావాణిలో వింత ఫిర్యాదు వచ్చింది.

Update: 2023-02-27 10:45 GMT

Jagtial: కింగ్‌ ఫిషర్‌ బీర్లు దొరకడం లేదు.. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు..

Jagtial: ప్రజావాణిలో వింత ఫిర్యాదు వచ్చింది. తమ ప్రాంతంలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ ఓ యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు.

ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ జిల్లాలోని కోరుట్ల, ధర్మపురిలలో అన్ని రకాల బ్రాండ్ బీర్లు అమ్ముతుంటే జగిత్యాలలో మాత్రం సిండికేట్ గా మారి నాసిరకం బీర్లు అంటగడుతున్నారని ఆరోపించాడు. ఇవి తాగిన ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఊరూరా బెల్ట్ షాపులు వెలిసి వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు కలెక్టర్ బీఎస్ లత ఎక్సైజ్ సూరింటెండెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. 



Tags:    

Similar News