Bowenpally: బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం
Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు.
Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రేయసి పై కత్తితో దాడి చేశాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు. బోయిన్‌పల్లిలో యువతి ఇంటికి వెళ్లి మరీ దాడికి యత్నించాడు. అనంతరం అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి దమ్మైగూడకు చెందిన గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.