Mallu Ravi: మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు.. వాళ్ల పార్టీనే ఖాళీ అవుతోంది
Mallu Ravi: బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిది
Mallu Ravi: బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిదని, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఎద్దేవా చేశారు. తాము అడగడం లేదని, వాళ్లు వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారాయన... చెరపకురా.. చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు మల్లు రవి... తమ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు.. వాళ్ల పార్టీనే ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు కారణం బీఆర్ఎస్ పార్టీనే అని,
బీఆర్ఎస్ పార్టీ నేతలు 100 రోజుల్లో వంద తప్పులు మాట్లాడి.. వాళ్ల పార్టీ నేతలే పార్టీని వీడేలా చేసుకున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లోకసభకు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని, పార్టీలో చేరడానికి, పోటీ చేయడానికి కూడా నేతలు లేరని రవి ఎద్దేవా చేశారు. తాము గెలవకపోయినా పరవా లేదు.. కానీ కాంగ్రెస్ గెలవొదని.. కవిత అరెస్టుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని అన్నారు.