Mallanna Sagar: తెలంగాణ రైతులకు అందుబాటులోకి మల్లన్న సాగర్‌

Mallanna Sagar: 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం

Update: 2021-08-13 12:50 GMT
తెలంగాణ రైతులకు అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఇమేజ్)

Mallanna Sagar: సాగునీటి రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మల్లన్న సాగర్‌ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగింది. ఈ నెల 18న 10 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్‌లోకి సీఎం కేసీఆర్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు. 17 వేల ఎకరాల్లో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

రంగనాయక సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌కు నీటి పంపింగ్ చేయనున్నారు. 13 కిలోమీటర్లు అండర్ టన్నెల్ ద్వారా నీటి పంపింగ్ జరుగుతుంది. తోగుట మండలం తుక్కపూర్‌లో 8 పంపులతో పంప్ హౌస్‌ నిర్మించగా ఒక్కో పంపు ద్వారా 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయొచ్చు. ఇలా రోజుకు 8 పంపుల ద్వారా 0.8 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే 60 రోజుల్లో 50 టీఎంసీలు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో సగం జిల్లాలకు వరప్రదాయనిగా మల్లన్న సాగర్ మారనుంది. 

Tags:    

Similar News