బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన అధికారులు.. గోదావరికి జలకళ
Godavari : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఓపెన్ చేశారు.
Godavari : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఓపెన్ చేశారు. దీంతో బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రం సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈరోజు వరకు అడుగంటుకు పోయిన గోదావరి జలాలు నూతనంగా బాబ్లీ వైపు నుండి బాసర గోదావరి మీదుగా వరద జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తూ పరవాళ్లు తొక్కుతున్నాయి.
నిన్న బాబ్లీ ప్రాజెక్టు 14గేట్లను ఎత్తగా దిగువకు 0.2 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తడం ఆనవాయితీగా వస్తుంది. జులై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంటాయని ఎస్సారెస్పీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. మహారాష్ట్రలో బాబ్లిగేట్లు ఎత్తడం వలన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.