Maha Shivaratri 2021: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ
Maha Shivaratri 2021: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు * ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Maha Shivaratri 2021: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి మహోత్సవాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాలకు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని వేములవాడ, కీసర గుట్ట, కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, వరంగల్ వేయిస్తంభాల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. అలాగే ఏపీలోని భీమవరంలో పంచారామక్షేత్రం సోమారామంకు భక్తులు పోటెత్తారు. కోటిపల్లి శ్రీచాయ సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అటు.. కోటప్పకొండకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.