Low Temperature: ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి
* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత * ఈ సీజన్‌లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Adilabad: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పడిపోతున్నాయి. దీంతో రాత్రిపూట బయటకు రావాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది.
జిల్లాల్లో ఈ సీజన్‌లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇటు హైదరాబాద్‌లో కూడా చలి ప్రభావం అధికమవుతోంది. నిన్న ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలకు పడిపోయింది.