Telangana Lockdown: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించాయి. ఈ నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.. ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. ఈ నెల 20 న నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు.
సీఎం కేసీఆర్ మంగళవారం కేబినెట్ మంత్రులందరితో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మే 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. తొలుత ఈ నెల 21వరకు లాక్ డౌన్ విధించింది తెలంగాణ సర్కార్. లాక్డౌన్ విధించిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.