Hyderabad: పాతబస్తీలో లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్

Hyderabad: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ను ప్రజలు పట్టించుకోవడం లేదు.

Update: 2021-05-13 06:23 GMT

Hyderabad: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ను ప్రజలు పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు పరుస్తున్న ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. పాతబస్తీలో లాక్‌డౌన్ ఆశయాన్ని నీరు గారుస్తున్నారు. రేపు రంజాన్ పండగ కావటంతో ఓల్డ్ సిటీ బస్తీలు ముస్లింలతో కిక్కిరిసి పోయాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, వైన్ షాపుల దగ్గర జనం క్యూ కట్టారు. సరుకులు, బట్టలు కోనేందుకు జనం భారీగా బయటకు వచ్చారు. దాదాపు అన్ని షాపుల వద్ద రద్దీ కనిస్తోంది.

మార్కెట్లలో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. గుంపులు గుంపులుగా పబ్లిక్ తిరుగుతుండడంతో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే చాన్సుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ జాం కావటంతో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా రద్దీ కొనసాగుతోంది. దాంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది సామాజిక దూరాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఆరుశాతం మంది కరోనా వైరస్ ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ మొదటి స్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ్టీ నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. ఫస్ట్ డే చూసీ చూడనట్లు వదిలేసినా నేటి నుంచి మాత్రం అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Full View


Tags:    

Similar News