హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో చిరుతల కలకలం

* రెండు రోజుల క్రితం శంషాబాద్‌ రోడ్డులో కన్పించిన చిరుత * ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తలదాచుకుని ఉండవచ్చని అనుమానం * ఎయిర్‌పోర్టు రన్‌వే గార్డులు అలర్ట్‌గా ఉండాలని సూచన * భయాందోళనలో శంషాబాద్‌, పహడీషరీఫ్‌

Update: 2021-01-20 05:42 GMT

హైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం (పాత చిత్రం)

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం కలకలం సృష్టిస్తోంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌ వేపై చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 10 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తిరగాడిన చిరుత.. ఆ తర్వాత గోడ దూకి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై చిరుత సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత తలదాచుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఎయిర్‌పోర్టు రన్‌వే వద్ద పనిచేసే గార్డులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పహడీషరీఫ్‌ పరిసరాల్లో కన్పించిన చిరుత మరో చిరుత అయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుతల సంచారంతో శంషాబాద్‌, పహడీషరీఫ్‌ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News