సమ్మర్‌లో లెమన్‌కు డిమాండ్.. ఉన్నప్పటికీ నష్టాల్లో నిమ్మ రైతులు

Lemon: తేమ, మంచు కారణంగా కాయకు... తెగుళ్లు సోకి తగ్గిన దిగుబడి

Update: 2022-04-29 12:32 GMT

సమ్మర్‌లో లెమన్‌కు డిమాండ్.. ఉన్నప్పటికీ నష్టాల్లో నిమ్మ రైతులు

Lemon: నిమ్మ ధర ఆకాశానంటుతున్న వేల దిగుబడి లేక రైతులు దివాళా తీస్తున్నారు. సమ్మర్‌లో లెమన్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ... ఈ సారి తేమ, మంచు కారణంగా తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో నిమ్మ సాగు పడిపోయి రైతులు దిగులు చెందుతున్నారు. కరోనా టైమ్‌లోనూ రవాణ సదుపాయం లేక ఎగుమతులు దెబ్బతిని నిమ్మ ధరలు పడిపోయాయి.

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఉన్న ఏకైక నిమ్మ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్క టిక్కి ధర రూ. 2000 నుంచి 2500 వరకు పలుకుతోంది. మార్కెట్‌లో నిమ్మకు ధర ఉన్నా దిగుబడి లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు కురిసిన అధిక వర్షాలు తోటలపై ప్రభావం చూపాయి. తేమ, మంచు అధికంగా ఉండడంతో పూత నేలరాలిపోవడం మరోవైపు చెట్లకు ఎర్రనల్లి సోకడంతో నిమ్మ దిగుబడులు సగానికి సగం పడిపోయాయి.

నిమ్మ తోటలు తెగుళ్ల బారిన పడి దిగుబడి తగ్గడంతో నిమ్మకాయలకు రేటు అధికంగా ఉన్నా రైతులకు లాభం లేకుండా పోయింది. లాభాల మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. పండిన నిమ్మ పంటను అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకెళ్తే టాన్స్ పోర్టు, కూలీల చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి లేక నష్టాలపాలైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News