ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావం సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలో వర్షపాతం తగ్గనుందని, ఆ తర్వాత రేపు మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఆయన స్పస్టం చేసారు. ప్రజలకు లో భయాందోళన అవసరం లేదని తెలిపారు.
ఇక మరో వైపు రేపు హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రేపు సాయంత్రం కేంద్ర బృందం రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం నష్ట తీవ్రతను అంచనా వేయనుంది. భారీ వరదలు ముంచెత్తుతున్న కారణంగా ఇటీవలే తక్షణ సాయంగా 13 వందల 50 కోట్లు కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. హైదరాబాద్‌లో వర్షం మోత మళ్లీ షురూ అయింది. తెల్లవారుజామునే భాగ్యనగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్‌బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్‌నగర్, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.