Rythu Bharosa: రైతులకు కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్..లక్షలాది మంది రైతులకు రైతు భరోసా కట్

Rythu Bharosa: తెలంగాణ సర్కార్ త్వరలోనే రాష్ట్రంలోని రైతులందరికీ షాక్ ఇవ్వబోంది. రైతు భరోసా స్కీముపై కీలక నిర్ణయం తీసుకోనుంది సర్కార్. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు రైతు భరోసా స్కీము కట్ అవ్వనుంది. దీంతో రైతులకు డబ్బులు అందవు?

Update: 2024-11-06 01:35 GMT

Rythu Bharosa: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే త్వరలోనే రైతులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా స్కీముపై కీలక నిర్ణయం త్వరలోనే తీసుకోనుంది. దీంతో లక్షలాది మంది రైతులుకు ఈ స్కీము నుంచి వచ్చే డబ్బులు అందవని తెలుస్తోంది.

నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన నిర్వహించనుంది. ఈ సర్వేలో భూవివరాలు కూడా నమోదు చేయనున్నారు. అందువల్ల ప్రతి కుటుంబానికి ఎంత భూమి ఉందో ఈ సర్వేలో తేలుతుంది. ఈ వివరాల ప్రకారం రైతులకు పంట భరోసా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి రూ. 15వేల వరకు రైతులకు ప్రతి సంవత్సరం చెల్లిస్తుంది. కానీ రైతులు రుణమాఫీ కారణంగా గత రెండు పంటలకు చెల్లించలేదు. అయితే ఈ సర్వే పూర్తి అయితే 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. తద్వారా అర్హులకు పంటసాయం అందడంతోపాటు ప్రభుత్వ ఖర్చు వేస్ట్ అవదని కొంతమంది నాయకులు చెబుతున్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సర్వే చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సర్వే పారదర్శకంగా జరిగినట్లయితే తెలంగాణలోని ప్రతి ఇంటి ముఖ చిత్రం మారుతుంది. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుకు మార్గం సులభం అవుతుంది. 

Tags:    

Similar News