Kurra Satyanarayana: మేము ఎవరి చెప్పులూ మోయ లేదు.. ముఖ్యమంత్రి పద్ధతిగా మాట్లాడాలి

Kurra Satyanarayana: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

Update: 2024-01-31 14:09 GMT

Kurra Satyanarayana: మేము ఎవరి చెప్పులూ మోయ లేదు.. ముఖ్యమంత్రి పద్ధతిగా మాట్లాడాలి

Kurra Satyanarayana: ఎరుకల సామాజిక వర్గానికి చెందిన తనను మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించారని, కానీ గవర్నర్ తమిళి సై తనను రిజెక్ట్ చేశారని, రాజ్యాంగ పరిరక్షకురాలైన గవర్నర్ తన పట్ల భక్షకురాలిగా మారారని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‎‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రతిపాదనలు నెలల కొద్దీ దగ్గర పెట్టుకున్న గవర్నర్... కోదండ రామ్ పేరున్న ప్రతిపాదనను ఒక్కరోజులోనే ఒకే చేశారని దుయ్యబట్టారు.

గరీబోళ్లను గవర్నర్ గుర్తించరా...? అని కుర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు ఏంటో నాకు తెలియదని, మేము ఎవరి చెప్పులు మోయ లేదన్నారాయన.. ముఖ్యమంత్రి పద్ధతిగా మాట్లాడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని తమ జాతి కోరుతోందని,

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళి సై రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కోర్టును ఆశ్రయించామని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరామ్ రాజ్యసభ సభ్యత్వం తీసుకోవచ్చు కదా. అంటూ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. తాను 40 ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్నానని, నా జీవితం తెరిచిన పుస్తకమన్నారాయన.

Tags:    

Similar News