KTR: అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి..!
KTR: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన.
KTR: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఓ వైపు సాగునీటి సంక్షోభం, మరోవైపు రుణమాఫీ ద్రోహం..ఇంకోవైపు రైతుభరోసా మోసం, అందని కౌలు సాయం అంటూ ట్వీట్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎంకు సోయిలేదా అంటూ మండిపడ్డారు. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎంకు దండన తప్పదని.. అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండని మనోధైర్యాన్నిచ్చారు కేటీఆర్.