ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై కేటీఆర్...
KTR Speech: AIని నిఘాకు వాడబోమని ప్రజలకు విశ్వాసం కల్పించాలి...
KTR Speech: వాల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వినియోగంపై జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విస్తృత ఉపయోగానికి ప్రజల విశ్వాసం పొందడమే ప్రభుత్వాలకు సవాల్ అన్నారు. మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునైన కత్తి లాంటివని.. డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు ప్రజల అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించబోమన్న భరోసా ప్రజలకు కల్పించాలన్నారు. ఈ చర్చా గోష్టిలో పలు దేశాల టెక్ నిపుణులు పాల్గొన్నారు.