KTR: ముఖ్యమంత్రిని నమ్మండి.. పనికిమాలిన వారిని కాదు
KTR: వానాకాలం పంటను ప్రభుత్వం పూర్తిగా కొంటుందని, తడిసిన ధాన్యం కూడా కొనాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
KTR: వానాకాలం పంటను ప్రభుత్వం పూర్తిగా కొంటుందని, తడిసిన ధాన్యం కూడా కొనాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి మాటలను, ఆలోచనలను నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దనీ కేటీఆర్ అన్నారు. మానేరు నదిలో మునిగి చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. సిరిసిల్ల దుర్ఘటన బాధ కలిగించిదని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు.
రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని, యాసంగిలో ధాన్యం కొనబోమన్న నిర్ణయంపై పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు.