KTR Tweet: తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Update: 2024-10-18 06:45 GMT

KTR: ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ్తామా?

KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలన చేతికాక పనికిమాలిన మాటలు... పాగల్ పనులు చేస్తున్నారని విమర్శించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని ఆక్షేపించారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందనుకునే వారు తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.

మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయిందని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టులో లక్షా 50 వేల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందన్నారు. బిల్డర్లను, రియ‌ల్టర్లను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందని చెప్పారు. బడే భాయ్ మోడీ ITIRని రద్దు చేసినా... తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేళ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదన్నారు. ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్తన భాండాగార‌మైందని ట్వీట్ చేశారు కేటీఆర్. మూసీ లూటిఫికేషన్ అని ట్యాగ్ చేశారు.


Tags:    

Similar News