KTR: కాంగ్రెస్ ఆఫీసులో కనుగోలు కేంద్రం తప్ప.. రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదు
KTR: కాంగ్రెస్ ఆఫీసులో కనుగోలు కేంద్రం తప్ప... రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదని ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR: కాంగ్రెస్ ఆఫీసులో కనుగోలు కేంద్రం తప్ప... రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదని ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఏ రైతుకు ముఖ్యమంత్రి మద్దతు లేదని... అందుకే వరికి, పత్తికి, దేనికీ మద్దతు ధర లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో... దోపిడీ రాజ్యం ఏలుతోందన్నారు. రైతుల రెక్కల కష్టం దర్జాగా దళారుల పాలవుతోందని ఆరోపించారు.
సన్నాలకే బోనస్ అన్న సన్నాసుల మాట... మార్కెట్ యార్డుల సాక్షిగా నీటిమూటే అయ్యిందని విమర్శించారు. మొన్న రైతుకు రుణమాఫీ చెయ్యలే... నిన్న రైతుకు పెట్టుబడి సాయం ఇయ్యలే... నేడు రైతు పండించిన పంటను కొనుగోలు చెయ్యలే అని ఆక్షేపించారు. ఇక.. ఈ ఇందిరమ్మ రాజ్యం ఉండెందుకు... ఆరుగాలం కష్టించే అన్నదాతను అరిగోస పెట్టేటందుకా అని ప్రశ్నించారు కేటీఆర్.