KTR: తెలంగాణ కరువులకు.. కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం
KTR: కాంగ్రెస్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కేటీఆర్.
KTR: కాంగ్రెస్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. తమ కరువు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అన్నారు. తలాపున గోదారి గలగలా పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని.. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని స్పష్టం చేశారు.
దగాపడ్డ నేల.. దశాబ్ధాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం అన్నారు. తమ తపనకు.. ఆలోచనకు.. అన్వేషణకు జలదౌత్యానికి.. కాళేశ్వరం నిదర్శనం అని.. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదని తెలియని మీ అజ్ఞానం అంటూ ఫైరయ్యారు.