హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పాల్గొన్న నేతలతో కేటీఆర్‌ భేటీ

Update: 2019-11-04 09:42 GMT

తెలంగాణ భవన్‌లో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పాల్గొన్న నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసన మండలి విప్ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే హరిప్రియ, భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, నోముల నర్సింలు ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో నేతలతో కేటీఆర్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేసే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.




 


Tags:    

Similar News