KTR Launche Asset Protection Cell: హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు 'అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌'

KTR Launche Asset Protection Cell: హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Update: 2020-07-05 14:38 GMT

KTR Launche Asset Protection Cell: హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో ఉన్న పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి తెలిపేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రారంభించింది. అంతే కాదు జీహెచ్ఎంసి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించింది. ఈ ఇన్ఫర్ మేషన్ ఇవ్వడానికి గాను 1800 599 0099 అస్సెట్‌ ప్రొటెక్షన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రగతిభవన్‌లో ఆదివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా పౌరులు ఫిర్యాదు లేదా సమాచారం అందిస్తే వెంటనే ఒక ప్రత్యేకమైనన ఫిర్యాదుగా నమోదు అవుతుంది. ఈ విశిష్ట సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రజలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ పనిచేయనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. అయితే ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి తన కోరుకుంటే తన వివరాలు బయటకు రాకుండా గొప్యత పాటించే వెసులుబాటు కూడా ఈ ప్రక్రియలో ఉన్నది. ఈమేరకు సమాచారం లేదా ఫిర్యాదు అందించిన వ్యక్తి వివరాలను బయటకి చెప్పకుండా కాపాడతాయి. 

Tags:    

Similar News