Defamation Case: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా: ఈ నెల 18న స్టేట్ మెంట్ రికార్డు

Defamation Case: కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.

Update: 2024-10-14 08:36 GMT

Defamation Case: కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సినీనటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 14న విచారించింది కోర్టు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రిపై బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో ఆయన కోరారు.

తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆడియో, వీడియోకు సంబంధించిన 23 ఆధారాలను కోర్టుకు కేటీఆర్ అందించారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ నెల 18న కేటీఆర్ స్టేట్ మెంట్ తో పాటు సాక్షుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది. అదే రోజుకు కేసు విచారణను వాయిదా వేసింది.

గతంలోనే ఇదే విషయమై సినీ నటులు అక్కినేని నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియా, వెంకటేశ్వరరావు స్టేట్ మెంట్లను కోర్టు రికార్డు చేసింది. అక్టోబర్ 2న మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Tags:    

Similar News