KTR: కాంగ్రెస్ వస్తే మళ్లీ తెలంగాణ ఆగమవుతుంది
KTR: కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి
KTR: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు మంత్రి కేటీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్‌లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. పార్టీల పనితీరు చూసి ఓటేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ తెలంగాణ ఆగమవుతుందని.. మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో కుత్బుల్లాపూర్‌ను అభివృద్ధి చేశామన్నారు. కుత్బుల్లాపూర్‌లో వివేక్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత కుత్బుల్లాపూర్‌కు మెట్రో రైలును తీసుకొస్తామన్న కేటీఆర్.. గండిమైసమ్మ చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.