KTR: కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?
KTR: కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ చిత్తు కాగితాలతో సమానం
KTR: కరెంట్ చుట్టూ తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండని కేటీఆర్ సూచించారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలంటూ కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కాలంతో పోటీ పడి ప్రాజెక్టులు నిర్మించామని, ఏడాదికి 11వేల కోట్ల రూపాయలను ఉచిత విద్యుత్‌కు ఖర్చు చేస్తున్నామన్నారు కేటీఆర్. రైతుల భూములకు రక్షణలాగా ధరణి పోర్టల్ తీసుకొచ్చామని గుర్తు చేశారు.
తెలంగాణలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల దాన్యం పండుతోందని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామన్నారు. ఆగమైపోయిన అన్నదాత బాగుండాలనేదే మా అభిమతం, కేసీఆర్ పాలనతో రాబందు రాజ్యం పోయి రైతు రాజ్యం వచ్చిందన్నారు కేటీఆర్.