KTR: బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి
KTR: రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది
KTR: ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. "రాహుల్ వచ్చి.. మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు" "మీరొచ్చి మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు" "మేం బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు" "మాది ముమ్మాటికీ T టీమ్.. తెలంగాణ టీమ్" తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ అంటూ ట్విట్టర్ వేదికగా మోడీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. నిన్నటి దాకా మత రాజకీయం చేశారు..! నేడు కుల రాజకీయానికి తెర తీశారా..? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల మీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన.. అరణ్య రోదనే అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయేనంటూ ఫైర్ అయ్యారు. బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు. కానీ.. మాకు బీసీలంటే.. బలమైన వర్గాలు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది. TSPSC పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు. నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా..? అంటూ మండిపడ్దారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం. ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు.. రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరం. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.