Minister KTR: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి రక్షణశాఖ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు

Update: 2021-07-15 14:00 GMT

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Minister KTR: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను ఇష్టం వచ్చినట్లు మిలటరీ అధికారులు మూసివేస్తున్నారని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రక్షణ శాఖ ఆదేశాలను మిటలీ అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. గతంలోనూ ఇదే విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. లోకల్ మిలటరీ అథారిటీ తన పరిధిలోని రోడ్లను కోవిడ్ కేసుల పేరుతో మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా రోడ్లు మూసివేస్తున్నారని కంటోన్మెంట్ యాక్టులోని సెక్షన్ 258కి ఇది పూర్తి విరుద్దమని కేటీఆర్ చెప్పారు. స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలోని రోడ్ల పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచనప్రాయంగా అంగీకరించారని, ఈ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. రోడ్లు మూసివేయకుండ అదేశాలివ్వాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మంత్రి కేటీఆర్ కోరారు.

Tags:    

Similar News