Krishna Sagar Rao: పార్టీలో పదవులు ఆనుభవించి.. వెళ్లే ముందు పార్టీపై బురద జల్లొద్దు
Krishna Sagar Rao: కాలానికి తగినట్టు పార్టీలు మారే వ్యక్తి విజయశాంతి
Krishna Sagar Rao: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విజయశాంతి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణాసాగర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరే క్రమంలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఏ పార్టీలోనైనా.. చేరొచ్చని.. కానీ పార్టీని వీడే క్రమంలో ఆ పార్టీపై బురద జల్లొద్దని కృష్ణసాగర్ రావు హితవు పలికారు. విజయశాంతి పార్టీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఉన్నత పదవిలో పనిచేసే అవకాశం పార్టీ ఇచ్చిందని గుర్తుచేశారు. విజయశాంతి సీజనల్ పొలిటిషియన్ లా.. రెగ్యూలర్ గా పార్టీ మారుతున్నారని విమర్శించారు.