Fruit Market: బాటసింగారానికి తరలిన కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌..

Fruit Market: కోర్టు తీర్పు వచ్చేవరకు వ్యాపారాలు చేయమంటున్న ఏజెంట్లు...

Update: 2021-12-08 05:33 GMT

Fruit Market: బాటసింగారానికి తరలిన కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌.. 

Fruit Market: హైదరాబాద్‌ కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ తరలింపు కొత్త తంటాలు తెచ్చి పెట్టింది. నగరంలో ఉన్న పండ్ల మార్కెట్‌ బాట సింగారం వెళ్లడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. కమీషన్‌ ఏజెంట్లు వ్యాపారాలు నిలిపివేయడంతో రోడ్లపైనే పండ్ల... క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు, మరోవైపు మున్సిపల్‌ అధికారుల చర్యలతో వ్యాపారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఫ్రూట్‌ మార్కెట్‌ను బాటసింగారంకు తరలించినా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సరిగ్గా జరగక తిరిగి కొత్తపేట్‌ పరిసరాలకే చేరుకుంటున్నారు. సకల సౌకర్యాలు కల్పించామని ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు బాట సింగారంపైపు ఆసక్తి కనబర్చడం లేదు. కమీషన్‌ ఏజెంట్లతే కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం చేయబోమంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో కొత్తపేట్‌లో పండ్ల వ్యాపారం ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నుల కొద్దీ వచ్చే రకరకాల పండ్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్లపై పండ్లు విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారమే మానేసినట్లు చెబుతున్నారు.

మొత్తానికి చిరు వ్యాపారులు బాటసింగారం వెళ్లలేక, కొత్తపేట్‌లో పండ్లు అమ్మలేక కుటుంబపోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News