Medak: ఎమ్మెల్యే భర్తపై అనర్హత వేటు

Medak: మెదక్ జిల్లా కొనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మెన్‌గా పని చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు కోపరేటివ్ అధికారులు.

Update: 2022-02-03 14:38 GMT

Medak: ఎమ్మెల్యే భర్తపై అనర్హత వేటు

Medak: మెదక్ జిల్లా కొనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మెన్‌గా పని చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు కోపరేటివ్ అధికారులు. మరో రెండు పర్యాయాలు సహకార సంఘానికి ఎన్నిక కాకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అసలు దేవేందర్ రెడ్డిపై అధికారులు ఎందుకు వేటు వేసారు ? అసలేం జరిగింది ?

మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి ఛైర్మెన్‌గా కొనసాగిన కొనాపూర్ సొసైటీలో రెండు కోట్లకు పైగా నిధులు గోల్‌మాల్ అయ్యాయి. ఈ మెత్తం డబ్బు దుర్వినియోగం జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ నిధుల గోల్ మాల్‌కు ఛైర్మెన్ దేవేందర్ రెడ్డి, సీఈవో గోపాల్ రెడ్డి బాధ్యులుగా విచారణలో వెల్లడైంది.

ఇదే విషయమై గత ఏడాది సెప్టెంబర్ 24న కొత్త అధ్యక్షురాలు విజయ లక్ష్మీ సమక్షంలో సమావేశమైన పాలకవర్గం ఆయనపై అనర్హత వేటు వేయాలని తీర్మానం చేసింది. దీంతో తెలంగాణ సహకార సంఘాల చట్టంను అనుసరించి దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని మెదక్ జిల్లా సహకార శాఖ అధికారి కె.కరుణ గత నెల 25 న ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ ఉత్తర్వులను బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవడానికి తాత్సారం చేస్తుండటంతో కొనాపూర్ సొసైటీ డైరెక్టర్లు హై కోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి డీసీసీబీ డైరెక్టర్‌గా, ఇఫ్కోలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సహకార సంఘం ఛైర్మెన్‌గా అనర్హత వేటు పడటంతో దేవేందర్ రెడ్డి ఈ రెండు పదవులు కోల్పోయే అవకాశం ఉంది.

మొత్తానికి దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటుతో పాటు సొసైటీలో దుర్వినియోగమైన 2.26 కోట్ల రూపాయలను సైతం 21 శాతం వడ్డీతో స్వాధీనం చేసుకోవాలని అధికారులు నివేదికలో తెలిపారు. మరోవైపు ఈ నిధులను రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కొనాపూర్ సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News