జాతీయ పార్టీల్లో ప్రత్యర్థులుగా మారిన కోమటిరెడ్డి బ్రదర్స్
Komati Reddy Brothers: మునుగోడులో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక క్యాడర్ సతమతం
Komati Reddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒకపుడు కాంగ్రెస్‌లో సంచలనం...ప్రత్యర్ధి పార్టీలతో పాటు సొంత పార్టీనేతలను కూడా తమ మాటల తూటాలతో ఆటాడుకున్న నేతలు. కానీ ప్రస్తుతం బ్రదర్స్‌లో చీలిక వచ్చింది. అన్న ఎంపీగా కాంగ్రెస్‌లో ...తమ్ముడు మాజీ ఎమ్మెల్యేగా బీజేపీలో.. అన్నదమ్ములుగా ఒకే పార్టీలో ఉంటూ.. గత కొన్నేళ్లుగా రాజకీయాలు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇపుడు...జాతీయ స్ధాయిలో రెండు ప్రధాన పార్టీలలో ప్రత్యర్ధులుగా మారారు. దీంతో గత కొన్నేళ్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ వెంట నడిచిన క్యాడర్‌లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ క్యాడర్ కకావికలం అయ్యిందా..? వాచ్ ద స్టోరీ.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో..అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా డైలామాలో పడ్డారని జోరుగా చర్చ నడుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ...బీజేపీకి జై కొట్టడం మోడీ అమిత్ షాలను పొగడటం కాంగ్రెస్‌లో ఇరకాటంలో పడేసినా...ఆయనను సస్పెండ్ చేయలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ముంగిట మునుగోడు ఉంది. మునుగోడు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు వారి అనుచరగణంలో కూడా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది.
మునుగోడు ఇష్యూ మొదలు తమ్ముడు రాజకీయ మార్పుతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూర్తిగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో పూర్తిగా పర్యటనలు ఆపేసారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో మాత్రం పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితం నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించి, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై ఆరోపణలు చేసారు తప్ప..ఎక్కడ కూడా మునుగోడు ఉప ఎన్నికలు, బిజెపి పార్టీపై ఆరోపణలు కాని, కామెంట్స్ కానీ చేయకపోవడంతో క్యాడర్‌లో కూడా కన్ఫ్యూషన్‌కు క్రియేట్ అవుతుందని ఆయన ముఖ్య అనుచరుల్లోనే ప్రచారం జరుగుతోంది.
ఇక తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసి..అన్నతో పాటు సమానంగా పలు నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు అందులో సగం క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వెంట బిజెపిలో జాయిన్ అయ్యారు. ఇక మిగిలిన క్యాడర్‌లో మాత్రం తాము ఏపార్టీలో ఉన్నామో...ఎవరి వైపు ఉండాలో అర్ధం కాని పరిస్ధితి కోమటిరెడ్డి బ్రదర్స్ క్యాడర్‌లో కనిపిస్తుంది.
కోమటిరెడ్డి బ్రదర్స్‌లో...నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్యలు ఉన్నారు. చిరుమర్తి లింగయ్య...కోమటిరెడ్డి బ్రదర్స్ పాలోవర్‌గా ఉండటం.. ముగ్గురు నేతలు కలిసి ప్రత్యర్ధి నేతలతో పాటు సొంత పార్టీ నేతలను తమ మాటల తూటాలతో ఉతికి ఆరేసారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో నకరికల్లు కాంగ్రెస్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు కాకుండా, మరో నేతకు వస్తుందన్న సమాచారంతో...ఏకంగా నకరికల్లులోనే కాంగ్రెస్ పార్టీనే సవాల్ చేసారు కోమటిరెడ్డి బ్రదర్స్. చిరుమర్తి లింగయ్యకు టికెట్ రాకుంటేతాము కూడా ఎన్నికలలో ఫోటీ చేయమంటూ సవాల్ చేయడంతో, ముగ్గురు నేతలు ఎమ్మెల్యేలుగా పోటీచేసారు.
కానీ ఆతర్వాత నకిరెకల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఇది కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా తమ సొంత నియోజకవర్గంలో దెబ్బతీసింది. ఇక ఇఫుడు తన తోడబుట్టిన తమ్ముడు కూడా కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరడంతో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఓంటరయ్యారు. ఇటు అనుచరుడు లింగయ్య టిఆర్ఎస్‌లో చేరడం, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంట కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నారో ఎవరు లేరో అర్ధం కాని పరిస్ధితి నెలకొంది.
ఇక కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు...సొంత పార్టీ నేతలను కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఆటాడుకున్నారు.. దీంతో ఇపుడు అవకాశం రావడంతో ప్రత్యర్ధులంతా, కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అడ్డా అనుకున్న ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి నేతలు మునుగోడును జల్లెడ పడుతున్నారు. ఇక అద్దంకి దయాకర్ అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తనదైన శైలిలో మాట్లాడారు. దీనికి తోడు మునుగోడు బీజేపీ అమిత్ షా మీటింగ్‌కు...కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జనాలను పంపారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించడం రాజకీయంగా కలకలం రేపింది. ఏదీ ఎమైనా గత ఇరవై ఏళ్లగా పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ వెంట రాజకీయంగా నడిచిన సెకండ్ స్ధాయి, తృతీయ స్ధాయి నేతలు ఇటు బిజెపిలోకి పోలేక.. వెంకట్ రెడ్డి వెనుక నడవలేక...కాంగ్రెస్‌లో ఉంటూ రాజగోపాల్ రెడ్డికి జై కొట్టలేక కన్ఫ్యూషన్ లో ఉన్న పరిస్ధితి నెలకొంది.