ఫామ్‎హౌస్ వీడియోపై కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి సెటైర్లు

* అమిత్‌షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌లపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు కిషన్ రెడ్డి

Update: 2022-11-04 03:50 GMT

ఫామ్‎హౌస్ వీడియోపై కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి సెటైర్లు

Kishan Reddy: మొయినాబాద్ ఫామ్‎హౌస్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వ్యవహారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక నేతల హస్తం ఉందని గట్టిగా చెబుతున్నారు. నిందుతలు, ఢిల్లీ పెద్దలకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఫోటోలతో సహా ఆధారాలు బయటపెట్టారు.దేశవ్యాప్తంగా కీలక నేతలు, సంస్థలకు వీడియో పంపించానని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇదే అంశంపై ఎవరెవర్ని కలుస్తారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలు సీఎం కేసీఆర్ బయట పెడతారా? నెక్స్ట్ ఏంటి అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు కేసీఆర్‎కు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి ఇప్పటికే ట్విట్టర్‎లో సెటైర్లు వేశారు. ఇదంతా డ్రామా అని కొట్టిపారేశారు. అధికారం కోల్పోతామన్న భయంతోనే అబద్ధాలని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాల్లేని పాత గాసిప్స్‌తో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టారని కిషన్‎రెడ్డి ఎద్దేవా చేశారు.

అమిత్‌షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌లపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్‎లో వెల్లడించారు. కిరాయికి తెచ్చుకున్న స్టేజి ఆర్టిస్టులతో వీడియోలు రికార్డ్‌ చేశారని దళారీలకు టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సంబంధాలు ఉన్నాయని కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఫామ్‌హౌస్‌ ఘటన నిందితులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News