Nizamabad: నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం.. ఓ వ్యక్తిని చితకబాది కారులో ఎక్కించుకుపోయిన దుండగులు
Nizamabad: TS 29 C6688 తెలుపు రంగు క్రెటా కారులో కిడ్నాప్
Nizamabad: నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. TS 29 C6688 తెలుపు రంగు క్రెటా కారులో వచ్చిన ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. ఓ వ్యక్తిని చితకబాది దుండగులు కారులో ఎక్కించుకుపోయారు. TS 29 C6688 వాహనం అఖిలేష్ యాదవ్ పేరుతో ఉంది. కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం బోధన్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రేమ వ్యవహారంగా అనుమానిస్తున్నారు. బోధన్‌కు చెందిన భాగయ్య యాదవ్ వద్ద ఉన్న క్రెటా కారును ..అతని అల్లుడు అఖిలేష్ యాదవ్ తీసుకెళ్లాడు. అదే కారులో గ్యాంగ్‌తో వచ్చిన అఖిలేష్, ఆ తర్వాత కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్ అయింది ఎవరు..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.