PHONE TAPPING CASE: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు

PHONE TAPPING CASE:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో హైదరాబాద్ కు రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం అందించారు.

Update: 2024-07-05 02:27 GMT

 PHONE TAPPING CASE: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు

PHONE TAPPING CASE: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో హైదరాబాద్ కు రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే అరెస్టు అయిన నలుగురు అధికారుల వాంగ్మూలాలను కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి మాత్రం కనిపించడంలేదు. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను విచారించి కేసును కొలిక్కి తీసుకురావాలని అధికారులు పట్టుదలగా ఉన్నా..పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు.

కాగా దర్యాప్తు అధికారులు మరోసారి ప్రభాకర్ రావు పాస్ పోర్టును జప్తు చేయాలని రీజినల్ పాస్ పోర్టు అధికారికి లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించేందుకు ఇదొక మార్గం. ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డిని ఈవిధంగా స్వదేశానికి రప్పించారు. కానీ ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించడం అంత ఈజీగా అయ్యేలా కనిపించడంలేదని అధికారులు అంటున్నట్లు సమాచారం.

తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని..పారిపోలేదని..దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదించే పక్షంలో ఆయన పాస్ పోర్టును రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. ఏ విధంగా చూసినా ప్రభాకర్ రావు ఇప్పట్లో భారత్ కు తిరిగి వచ్చే ఛాన్స్ కనిపించకపోవడంతో దర్యాప్తు పురోగతిపై గందరగోళం నెలకొంది. ఇక విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా ఇప్పటికే భారత్ కు తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాల మధ్య సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పట్లో పుంచుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు.

Tags:    

Similar News