Hyderabad: మహేష్ బ్యాంక్ నిధుల బదిలీ కేసులో కీలక విషయాలు

Hyderabad: పక్కా ప్లాన్‌తో హ్యాకింగ్ చేసిన నైజీరియన్లు

Update: 2022-02-08 07:32 GMT

Hyderabad: మహేష్ బ్యాంక్ నిధుల బదిలీ కేసులో కీలక విషయాలు

Hyderabad: మహేష్ బ్యాంక్ నిధుల బదిలీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కాప్లాన్‌తో హ్యాకింగ్ చేసినట్లు గుర్తించారు. హ్యాకింగ్ సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండ జాగ్రత్త పడ్డారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయితే ఆర్బీఐతో పాటు ఐటీ శాఖకు రెడ్ ట్యాగ్ అలారం ఉంటుంది. రెడ్ ట్యాగ్ మోగితే హ్యాకింగ్‌పై వెంటనే ఆర్బీఐకు సమాచారం అందుతుంది. అయితే రెడ్ ట్యాగ్ మోగకుండా ఈ నైజీరియన్ ముఠా జాగ్రత్తపడింది. వ్యాపారవేత్తల కరెంట్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకుని రెడ్ ట్యాగ్ వెళ్లకుండా బ్లూ ప్రింట్ ప్లాన్ చేశారు నైజీరియన్లు. బదిలీ చేసుకున్న నగదును 128 ఖాతాల్లోకి తక్కువ మొత్తం మళ్లించారు. ఇక 128 ఖాతాలు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మిగిలిన నైజీరియన్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News