Malla Reddy: కేసీఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అందాయి
Malla Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
Malla Reddy: సీఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఎస్పీ పార్టీ నాయకులు వారి అనుచరులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 500మందికి మంత్రి మల్లారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మూడోసారి కేసిఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన యువకులు, నాయకులు ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదని అన్నారు.