Telangana Elections 2023: సర్వేల ఆధారంగా బీఆర్ఎస్ అభ్యర్ధుల ఫైనల్ లిస్టు.. 25 నుంచి 30 సిట్టింగ్ సీట్లలో మార్పు..?
Telangana Assembly: మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Telangana Assembly: మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014 ఎన్నికల్లో 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో 88 సీట్లు సాధించింది. ఈసారి 100 సీట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. 2018 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్.. 105 స్థానాల్లో అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఐదు సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫాంలు దక్కలేదు. ఈసారి సుమారు 25 నుంచి 30 సిట్టింగ్ సీట్లలో మార్పు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మొన్నటి వరకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తో ట్రాయంగిల్ ఫైట్ ఉంటుందనే ప్రచారం జరిగింది. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ తో ముఖాముకి పోరు ఉంటుందనే అంచనాతో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. 40పైగా స్థానాల్లో కాంగ్రెస్ తో గట్టి పోటీ ఉంటుందని.. ఉమ్మడి జిల్లాలవారీగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. జిల్లా పర్యటనల్లో సభల్లో కొందరి అభ్యర్దులను కేటీఆర్ ప్రకటిస్తున్నారు.
టికెట్టు దక్కని నేతల లిస్టులు తెప్పించుకుని.. వారి స్థానాల్లో కొత్తవారి పేర్లను కేసీఆర్ ప్రకటించనున్నారు. అగస్టు 18న నిజ శ్రావణ మాసంలో మంచి శుభముహుర్తానా అభ్యర్దుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది తెలుస్తోంది. సర్వేల ఆధారంగా బీఆర్ఎస్ అభ్యర్దులను ఫైనల్ చేయనున్నారు. ఈసారి కేసీఆర్ కొన్ని సీట్లలో రిస్క్ తీసుకునే చాన్స్ లేదని పార్టీ అగ్రనేతలు అంటున్నారు. వారం వారం మారుతున్న సర్వేలను బట్టి పార్టీ వ్యూహాలను కూడా మార్చుతున్నారు. ఇప్పటికే 20 మంది పేర్లను పలు సభల్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రకటించారు.