KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

*ధాన్యం కొనుగోళ్లు, పునర్విభజన చట్టంలోని హామీలు..నీటి వాటాల కేటాయింపుపై చర్చ *శుక్రవారం వరకు సీఎం ఢిల్లీలో ఉంటే అవకాశం

Update: 2021-11-22 02:48 GMT

ఢిల్లీలో సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

KCR: వరి ధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు తేల్చాలంటూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఉన్నారు. సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులను రాష్ట్ర మంత్రులు, అధికారులు కలవనున్నారు. దాదాపు వారం రోజుల పాటు మంత్రులను కలవనున్నారు సీఎం.

యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో అమీతుమీ కి సీఎం కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇప్పటికే అనేక సార్లు తెలంగాణ నుండి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయిన కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇవాళ హస్తినకు ప్రయాణం అయ్యారు.

రేపు కేంద్ర మంత్రులతోపాటు, ఇతర అధికారులను కలిసి యాసంగి పంట కొనుగోలులపై స్పష్టత ఇవ్వాలని కొరనున్నట్లు సమాచారం. ఒకవేళ వరి ధాన్యం కొంటె ఎంతమేరకు కొంటారు అని రాత పూర్వకంగా ఇవ్వాలని కొరనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం వరి వేసుకోండి అని ప్రకటనలు చేస్తున్నారు కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు మాత్రం కొనం అని లీక్ ఇచ్చిన నేపథ్యంలో ఎదో ఒక్కటి నేరుగా కేంద్ర మంత్రితోనే ప్రకటన చేయించాలి అనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను ఇరుకున పెట్టచ్చు అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారట.

అంతే కాకుండా రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం ఢీ కొట్టనున్నట్లు సమాచారం. అనేక పెండింగ్ అంశాలపై నేరుగా నిలదీయనున్నారట. కృష్ణా, గోదావరి నది జలాల వాటాతో పాటు అనేక అంశాలపై ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ పర్యటనలో అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ లపై చర్చించనున్నారు.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న గులాబీ బాస్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసన గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే ఇప్పటికే నది జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డ్ లను సైతం వాళ్ళ ఆధీనంలోకి తీసుకునేందుకు గజిట్ ఇచ్చింది కానీ ఇప్పటివరకు కూడా ఇరు బోర్డ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి స్థాయిలో అప్పగించలేదు.

అంతేకాకుండా రాష్ట్ర ఏర్పటు నుండి కూడా ట్రిబ్యునల్ ఏర్పటు చేయాలని కేంద్ర ప్రభుత్వంను కోరుతోంది. రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు దీనిపై అనేకసార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కేసీఆర్ కలసిన కూడా ఎలాంటి ప్రయోజనం లేదు కనుక మరోసారి కేంద్ర ప్రభుత్వంతో ఎదో ఒక్కటి తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటనలో జలశక్తి మంత్రి ని మరోసారి కలిసే అవకాశం ఉంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ ని సైతం కలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News