జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో కేసీఆర్ భేటీ.. ప్రాంతీయ పార్టీల సత్తా...

KCR - Hemant Soren: ప్రత్యామ్నాయంపై త్వరలో స్పష్టత...

Update: 2022-03-05 03:12 GMT

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో కేసీఆర్ భేటీ.. ప్రాంతీయ పార్టీల సత్తా...

KCR - Hemant Soren: దేశాన్ని గాడిలో పెట్టి సరైన దిశలో నడిపేందుకు గట్టి ప్రయత్నం మొదలైందని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ‌అన్నారు. త్వరలోనే తామంతా కలిసి ఏ ఎజెండాతో, ఎలా ముందుకు వెళ్లాలో, దేశాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహం ఖరారు చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కాదని.. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ లాంటివి ఖరారు కాలేదని.. ఇప్పుడే తొందర పడి ఏ పేరూ పెట్టవద్దన్నారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తాను దేశంలోని రాజకీయ పరిస్థితులు, బీజేపీ వ్యతిరేక కూటమి రూపకల్పన వంటి అంశాలపై చర్చించామన్నారు కేసీఆర్. ఇక కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదని, దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురి నేతల్ని కలవడం జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్. అచ్ఛే భారత్, ప్రస్తుతం ఉన్న భారత్ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

Tags:    

Similar News