KCR: తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
KCR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం
KCR: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల సమావేశం కొనసాగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో భేటీ అయిన కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది బీఆర్‌ఎస్. పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూపులపై అధిష్టానం అలర్టయింది. చేవెళ్లలో రంజిత్‌రెడ్డి పోటీపై అనిశ్చితి నెలకొంది. రంజిత్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కాసాని వీరేష్ కోరుతున్నారు. వరంగల్‌లో కడియం కావ్య, ఆరూరి రమేష్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెదక్‌లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, కంటారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌లో గాలి అనిల్ కుమార్ పేర్లను గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లడంతో సరికొత్త వ్యూహం అనుసరిస్తోంది గులాబీ పార్టీ.