Raghunandan Rao: తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారు
Raghunandan Rao: నిజాం వారసునికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏంటి..?
Raghunandan Rao: తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఎవరికి ఊడిగం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను బానిసలుగా చేసి హింసించిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్‌ల ఆత్మలు కేసీఆర్ చర్యలతో ఘోషిస్తాయని మండిపడ్డారు.