తెలంగాణలో థియేటర్స్‌ కు పూర్తి స్థాయి అనుమతులు

కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లకు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది.

Update: 2021-02-05 10:06 GMT

థియేటర్స్ ఫైల్ ఫోటో 

కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లకు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తెలియజేసింది. కరోనా కారణంగా కేంద్రం గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి. అయితే కేంద్రం ప్రతి రంగంలో ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిసింది. తెలంగాణలోని థియేటర్స్‌‌లో 100 శాతం ప్రేక్షకులను అనుమతులిచ్చేలా ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో జారీ చేసింది.

ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన క్రాక్, అల్లుడు అదుర్స్ , రెడ్ వంటి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్లలో సందడి చేశాయి. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ బయట ఫిబ్రవరి 1 నుంచి థియేటర్స్‌లో 50 శాతం నుంచి 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News