KCR: ఇవాళ మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో కేసీఆర్ క్యాంపెయిన్
KCR: ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్న గులాబీ దళపతి
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న తరుణంలో గులాబీ బాస్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే.. తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న గులాబీ దళపతి.. రెండోవిడత ఎన్నికల ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల్లో పర్యటనలు, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ.. ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు గులాబీ బాస్.